హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 61 కేజీల గంజాయి సీజ్

E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం రూ.3 లక్షల విలువైన 61 కేజీల డ్రై గంజాయి పట్టుకున్నట్లు DSP జీవన్ తెలిపారు. ఒడిశా చిత్రకొండ నుంచి రాజమండ్రి మీదుగా కారులో ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. యూపీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి కారు, 3 మొబైల్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.