హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సుందీకరణ పనులు ప్రణాళికా బద్ధంగా చేయాలి'

VZM: బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ ఎల్.రామలక్ష్మి శుక్రవారం పట్టణంలోని రాణి మల్లమ్మదేవి పార్క్‌, తాండ్రపాపారాయ విగ్రహం, అంబేద్కర్‌ విగ్రహం జంక్షన్లో సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులు ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే పార్క్‌ గట్టుపై రోడ్డు, కాలువ నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు.