హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దేవస్థానంలో గోమాతకు శ్రీమంతం

NTR: జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరిలో స్వయంభు శ్రీ వాల్మీకోత్సవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని గోమాతకు శ్రీమంత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గుమ్మ వెంకటేష్, ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు పాల్గొన్నారు.