హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాకపోకలకు అంతరాయం

ASR: చింతూరు నుంచి కూనవరం వెళ్లే రహదారిలో లింగాపురం వద్ద ఓ భారీ వృక్షం విరిగిపడి రహదారిపై పడింది. ఈ సమయంలో ఆ రహదారిపై ఎవరూ ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వృక్షం అడ్డంగా పడటంతో రాకపోకలు స్తంభించాయి. విరిగిపడిన చెట్టును రోడ్డుపై నుంచి తొలగించాలని ఆర్అండ్‌బీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.