హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరిట్ విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

VSP: పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డులో ఓ కంపెనీ సౌజన్యంతో శుక్రవారం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిశిక్త్ కిషోర్ చేతుల మీదుగా 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు మెరిట్ సాధించిన 103 మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. శ్రీహరిపురం, మల్కాపురం,స్కిందియా, మింది,నడుపూర్ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లతో పాటు ట్రాలీ బ్యాగులు అందజేశారు.