హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శింగరకొండలో సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు

BPT: శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామిని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన 37 కేడబ్ల్యూ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించి, ఆర్యవైశ్య సంఘం అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేశారు. శింగరకొండను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.