TPT: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి శుక్రవారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఉదయం 8 - 9 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణస్వామివారికి నూతన యజ్ఞోపవీతం


