హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్-జర్నలిస్టుల మధ్య రాఖీ బంధం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్-మీడియా మధ్య ఉన్న సత్సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. విధుల నిర్వహణలో ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఇరువురు ఆశభావం వ్యక్తం చేశారు.