హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు

SKLM: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజను ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈఓ ప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మహిళలు, ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో పాల్గొని వరలక్ష్మీ మాతకు కుంకుమ పూజలు చేశారు.