హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇదిగో ప్రమాదకర గోతి.. 40 అడుగుల లోతు..!

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం ముందు అఫ్రాన్ ప్రాంతంలో 40 అడుగుల గోతి అత్యంత ప్రమాదకరంగా ఉంది. గోతికి అడ్డంగా కట్టవలసిన పిట్టగోడ నిర్మాణం‌పై అధికారులు దృష్టి సారించలేదు. జలాశయం ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పర్యటకులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఆదమరిసి ఆ ప్రాంతంలో సంచరిస్తే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.