కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో 1,200 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతి మహిళకు గాజులు, జాకెట్ ముక్క, వరలక్ష్మీ దేవి ప్రతిమను దేవస్థాన సిబ్బంది అందజేశారు. ఆలయ ఛైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఈవో సత్యకుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకన్న ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం


