CTR: జిల్లాలో ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో పీసీఆర్ పాఠశాల నుంచి ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన యువ క్రీడాకారులను సన్మానిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 29న క్రీడాకారులకు సన్మానం


