BPT: ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం ఆయన సొంత ఊరు. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, స్వగ్రామంలో ఉన్న థియేటర్‌కు వెళ్లారు. ఎలాంటి హంగామా, సెలబ్రిటీ హోదా చూపించకుండా సాధారణ వ్యక్తిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సొంతూర్లో టిక్కెట్ కొని సినిమా చూసిన నటుడు


