NTR: మాధవరం సొసైటీలో పంట రుణాల మంజూరుకు పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా, 15 రోజులుగా తిప్పుతున్నారని రైతు కోకులకుంట వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ ఛైర్మన్ కోకులకుంట మాధవరావు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఏ.కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఫిర్యాదుపై వెంటనే విచారణ జరుపుతామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట రుణాల పర్సంటేజీపై వినతి


