ASR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డుంబ్రిగుడ మండలం అరకు సంతలో అక్కాతమ్ముడి ఆత్మీయత కనిపించింది. అక్క తన తమ్ముడికి రాఖీ కట్టి ప్రేమాభిమానాలను చాటుకుంది. అనంతరం తమ్ముడు అక్క ఆశీర్వాదం తీసుకున్నాడు. సంతలో చోటుచేసుకున్న ఈ ఆప్యాయ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
రాఖీ కట్టిన అక్క.. ఆశీర్వాదం తీసుకున్న తమ్ముడు


