హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ రోడ్డుపై పడుకొని మహిళ నిరసన

ప్రకాశం: కనిగిరి పట్టణానికి చెందిన బత్తుల స్వాతి బొడ్డు చావిడి సమీపంలో రోడ్డు మార్గంలో స్టీల్ స్టాండ్‌లో బిస్కెట్లు అమ్ముకుంటు జీవనం సాగిస్తుంది. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీ వారు దానిని తీసుకువెళ్లారు. అందుకు నిరసనగా నాకు తెలియకుండా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకువెళ్తారు అంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్డుపై నిరసన చేపట్టారు.