హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్మశాన వాటిక విస్తరణకు చర్యలేవీ?

KRNL: ఆస్పరి మండలం కైరుప్పలలోని స్మశాన వాటికలో స్థలం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాల బెగార్ల సంఘం సభ్యులు తెలిపారు. పాత సమాధుల వద్దే కొత్త గుంతలు తీయడంతో పుర్రెలు, ఎముకలు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుంతలు తీసే కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. స్మశాన వాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.