హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన

అన్నమయ్య: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాయచోటి పట్టణంలో శుక్రవారం నల్లరిబ్బన్లు పెట్టుకుని బ్యాంకుల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని, రివైజ్ చేసిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.