హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పులస చేపకు భారీ ధర

కోనసీమ: పుస్తెలు అమ్మైనా పులస చేప కొనాలి అనే నానుడి ఒకటి ఉంది. దీనికి తగ్గట్టు గానే మార్కెట్‌లో పులస చేపకు అంత డిమాండ్ ఉంది. శుక్రవారం కోనసీమలో అంతర్భాగం అయిన పుదుచ్చేరి యానాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఓ పులస చేప ఏకంగా రూ. 24 వేలు ధర పలికింది. అంతకు ముందు మరో చిన్న పులస చేప రూ.7,300కి అమ్ముడు పోయింది.