హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జీల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

BPT: జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఇవాళ జిల్లా పోలీస్‌లు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో బస చేసిన వారి వివరాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.