హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ రంగయ్యకు రాఖీ కట్టిన స్వర్ణలత

ATP: అనంతపురంలోని మాజీ ఎంపీ తలారి రంగయ్య నివాసంలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగయ్యకు ఆమె రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.