హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తి పంటను పరిశీలించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లి గ్రామంలో వర్షాలు లేక దెబ్బతిన్న పత్తి పంటను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. పంటను పీకేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి కష్టాలు, నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.