హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరవు నేలల్లో కృష్ణా జలాల పరవళ్లు

అన్నమయ్య: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ–నీవా జలాలు చేరుకున్నాయి. దీంతో రాయలసీమ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా జలాలు కుప్పం వైపు పయనించనున్నాయి. కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు జలకళ వచ్చి, సాగుకు కొత్త ఊపిరి అందనుంది.