VZM: బొబ్బిలి MRO కార్యాలయం వద్ద శుక్రవారం గిరిజన సమస్యలు పరిష్కారం కోరుతూ CPI ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సదుపాయాలు కల్పించాలని CPI జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం జిల్లాకు ప్రత్యేక ITDA ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాకు ప్రత్యేక ITDA ఏర్పాటు చేయాలి'


