హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంచిలో పసికందు లభ్యం

ATP: తనకల్లు(M) చీకటిమానిపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో పసికందును వదిలి వెళ్లారు. చిన్నారి ఏడుపులు విన్న గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్త రెడ్డమ్మకు సమాచారం అందించారు. ఆమె ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవికి తెలియజేయడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.