హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4ఏళ్ల బాలిక కిడ్నాప్.. చేదించిన పోలీసులు

విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా బస్టాప్ వద్ద నిద్రిస్తున్న 4ఏళ్ల బాలికను రాత్రి ఒంటి గంట సమయంలో స్కూటీపై వచ్చిన యువకులు కిడ్నాప్ చేశారు. విజయవాడ నుంచి వచ్చిన దంపతులు చిన్నారితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టూ టౌన్ పోలీసులు కిడ్నాప్‌ని గంటల్లోనే ఛేదించినట్లు తెలిపారు.