హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన ఏఎంసీ ఛైర్మన్

ELR: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఉంగుటూరు ఏఎంసీ ఛైర్మన్ సూరత్తుల జ్యోతి అయ్యప్ప శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి అయ్యప్ప సోదరభావంతో ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఎమ్మెల్యే ఆమెకు రాఖీ పౌర్ణమి కానుకగా చీర, గాజులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.