హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ సమస్యలపై అర్జీల స్వీకరణ

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, సెక్రటరీతో పాటు ఐదుగురు సభ్యుల బృందం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించింది. ఎస్సీ వర్గాల సమస్యలు, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను కమిషన్ సభ్యులు స్వీకరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు.