హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం

NTR: తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టలేరుకు వరద చేరింది. దీంతో గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవహిస్తోంది. కాగా, గంపలగూడెం, వినగడప గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.