హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వేగుళ్ళకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్

కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును బ్రహ్మకుమారీలు శుక్రవారం స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యేకు రాఖీ కట్టి ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. బ్రహ్మకుమారీలు సమాజంలో ఆధ్యాత్మికత, ప్రశాంతతను పెంపొందించడంతో పాటు మానవీయ విలువలు, సోదరభావాన్ని విస్తరించేందుకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.