హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న RTC బస్సు

TPT: జిల్లా పెళ్లకూరి మండలం చెంబడిపాళెం జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఆగిఉన్న కట్టెల లోడు లారీని కర్ణాటక RTC వోల్వో బస్సు ఢీకొట్టింది. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.