కర్నూలు జిల్లాలోని కొటేకల్, సాంబగల్లు, హాలిగేరి, కుప్పగల్ ప్రాంతాల్లో చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌ఓ పి.శ్యామల సూచించారు. సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల కెమెరాలు అమర్చామన్నారు. ఒంటరిగా పశువులను మేపేందుకు వెళ్లవద్దన్నారు. చిరుత కనిపిస్తే 9440810075, 9703554453కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిరుత సంచారంపై అటవీ శాఖ హెచ్చరిక!


