హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

Dy.CM ఆదేశాలతో తనిఖీలు

AKP: కృష్ణంపాలెం, పునరావాస కాలనీ వాసుల ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులు బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థలో తనిఖీలు చేపట్టారు. ప్రీ-కమిషనింగ్ ప్రక్రియలో బాయిలర్ నుంచి కాలుష్యం వెలువడుతున్నట్లు గుర్తించి కాలుష్య నియంత్రణ వ్యవస్థలు పూర్తయ్యే వరకు కంపెనీ కార్యకలాపాలను నిలిపివేశారు.