హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారికి అటవీ అనుమతులే అడ్డంకి'

ASR: రాజవొమ్మంగి అమ్మిరేకుల రహదారి నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు కాకపోవడంతో కొంతమేర పనులు నిలిచిపోయాయని ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు తెలిపారు. అటవీ పరిధిలోని ప్రాంతంలో తారు రోడ్డు నిర్మాణానికి అనుమతులు అవసరమని, మిగిలిన ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిధులు త్వరగా మంజూరు చేయాలని ఐటీడీఏ అధికారులను కోరారు.