CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వెలసిన శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం దానిమ్మ గింజల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారి మూలవిరాటు పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి ఆభరణాలు, గాజులు, పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
దానిమ్మ గింజల అలంకారంలో విరుపాక్షి మారెమ్మ


