హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బస్సులు లేక ఇబ్బందులు

శ్రీకాకుళం: రాఖీ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్నీ ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు కుటుంబ సమేతంగా సొంతూర్లకు వెళ్తున్నారు. ఈ మేరకు సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిలబడేందుకు సైతం బస్సుల్లో ఖాళీ ఉండటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.