ఏలూరు: సుబ్బమ్మదేవి స్కూల్ సమీపంలో చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ బాలుడిని స్థానికులు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. ఓ హోటల్లో నగదు దొంగిలించాడనే ఆరోపణలతో బాలుడిని పట్టుకున్న కొందరు చొక్కా విప్పించి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బాలుడిని స్తంభానికి కట్టేసి దాడి..!


