హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల ఆరోగ్యం కోసం ప్రత్యేక యోగా సాధన

ATP: విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి అధిగమించి, శారీరక ధారుడ్యం పెంపొందించుకోవడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా ఏఆర్ పోలీసు సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక యోగా సాధన నిర్వహించారు. జిల్లా SP పి. జగదీష్ ఆదేశాలతో అదనపు SP ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగా మాస్టర్ చలపతి సిబ్బంది చేత ఆసనాలు వేయించారు.