TPT: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు తిరుపతి జిల్లా కేంద్రంగా నిర్వహించిన ఏఈఈ నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 34 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 36,670 మంది దరఖాస్తు చేసుకోగా 31,075 మంది హాజరయ్యారు. సరాసరి హాజరు శాతం 84.74గా నమోదైంది. నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన ఏఈఈ నియామక పరీక్షలు


