హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి అన్నదానం ట్రస్ట్ కు 51,116 రూపాయలు విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం రాజవరం వాస్తవ్యులు కందుకూరి సూర్య తేజ, సౌమ్య వారి కుటుంబ సభ్యులు రూ. 51,116విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.