హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: జడ్చర్ల డా.బి.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్, ఇంగ్లిష్ విభాగాల్లో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.సుకన్య తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు తప్పనిసరి. నెట్, సెట్, పీహెచ్‌డీకి ప్రాధాన్యం ఉంటుంది. SEP 2లోపు దరఖాస్తులు సమర్పించాలని, 3న ఉదయం 10.30కు ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.