NLR: నీటి గుంటలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సైదాపురం మండలం ఇసుకపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... నెల్లూరు తెలుగు గంగ కాల్వ క్వార్టర్స్‌కు చెందిన కృష్ణ అమ్మమ్మను చూసేందుకు ఇసుకపల్లికి వచ్చాడు. ఇంతలోనే ఏం జరిగిందో గాని నీటి గుంటలో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
నీటి గుంటలో పడి యువకుడు మృతి


