హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరునో..?

కృష్ణా: నందిగామ మెయిన్ బజార్‌లో భారీ వాహనాల దిగుమతులతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు లారీలు రోడ్డు మధ్యలో నిలిపి సరుకులు దించుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వాహనాలకు నిబంధనలు, భారీ వాహనాలకు మినహాయింపులా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.