HYD: నగరంలోని జూబ్లీ బస్టాండ్‌లో రాఖీ పౌర్ణమి సందర్భంగా భారీ రద్ధీ నెలకొంది. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు సొంతూళ్లకు బయలుదేరడంతో బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయింది. బస్సులో సీటు కోసం ప్రయాణికులు పోటీపడుతున్నారు. ప్రయాణికుల రద్దీతో JBS సందడిగా మారింది. పండుగ సమయంలో అధికారులు బస్సుల సంఖ్యను పెంచితే బాగుండేదని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న JBS


