హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కార్డాన్ సెర్చ్

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమలలోని బాలాజీ నగర్ కాలనీలో సంబంధిత టీటీడీ విభాగాల సమన్వయంతో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, టీటీడీ సిబ్బంది సంయుక్తంగా పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల రికార్డులతో పాటు, అక్కడ నివసిస్తున్న వ్యక్తుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి ధ్రువీకరించారు.