హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామేపల్లిలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు!

ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో నేడు ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. కామేపల్లికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడం ఆనవాయితీ. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు.