హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల రోజులుగా ఆర్టీసీ బస్సు లేక ఇబ్బందులు

BHPL: పరకాల-గంగిరేణిగూడెం మార్గంలో నడిచే RTC బస్సు నెల రోజులుగా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపల్లి, గంగిరేణిగూడెం, వసంతపూర్ గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలన్నారు.