హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు: TGEJAC

నారాయణపేట జిల్లా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారి సహనాన్ని పరీక్షించొద్దని జిల్లా ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.