PPM: కురుపాం మండలం నీలకంఠాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని కొండలేవిడి వద్ద ప్రయాణికుల విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. ఐదేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో భవనం చుట్టూ మొక్కలు పెరిగి, స్లాబ్ పెచ్చులూడింది. దీంతో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థలో విశ్రాంతి భవనం.. చెట్ల నీడే దిక్కు!


