హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోవులకు రాఖీలు కట్టిన జంతు ప్రేమికురాలు

JN: జిల్లా పాలకుర్తికి చెందిన జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి, రక్షాబంధన్ పర్వదినాన తన పెంపుడు గోవులకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. వేదమంత్రాల నడుమ గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి, దీపహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. మిఠాయిలకు బదులుగా అరటి పండ్లు, ఆకుకూరలు తినిపించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.